Skip to main content

Outline

కంటెంట్ పరిచయం

Gemini ఓవర్‌వ్యూ

Gemini అనేది గూగుల్‌కు చెందిన అన్ని రకాల పనులకు ఉపయోగపడే AI అసిస్టెంట్. ఇది ఒక మల్టీ-మోడల్ స్పేస్. ఇందులో మీరు టెక్స్ట్‌ను, ఇమేజ్‌లను, వీడియోను, లేదా వాయిస్‌ను ఉపయోగించి ఇంటరాక్ట్ కావచ్చు.

Geminiని మీ అసిస్టెంట్ అని అనుకోండి. దీని అసలు బలం- మీ క్లాస్‌ల కోసం ప్లానింగ్, ప్రిపరేషన్ వంటి కష్టమైన పనులను వేగంగా హ్యాండిల్ చేయడం:

  • స్కాఫోల్డింగ్‌లో సహాయం చేయడం: ఇది ఒక పెద్ద చాప్టర్‌ను సెకన్లలోనే సింపుల్‌గా ఉండే స్టెప్-బై-స్టెప్ గైడ్‌లుగా విడగొట్టగలదు.

  • అన్ని లెర్నింగ్ లెవెల్స్‌కు తగినట్లుగా సమాధానాలు ఇస్తుంది: మీరు పొడవైన, కష్టమైన పేరాగ్రాఫ్‌ను తీసుకొని, దాని భాషను మరింత సరళంగా మార్చమని Geminiని అడగవచ్చు.

  • క్షణాల్లో ఆసక్తికరమైన ఉదాహరణలను క్రియేట్ చేయడం: కష్టమైన టాపిక్‌లను విద్యార్థులకు ఇష్టమైన విషయాలతో ముడిపెడుతూ, రోజువారీ జీవితంలోని ఉదాహరణలను లేదా పోలికలను ఇది వెంటనే క్రియేట్ చేయగలదు.

ఇన్‌స్ట్రక్షన్‌ను, ప్రొఫెషనల్ వర్క్‌ను మెరుగుపరచడానికి Gemini కో-డిజైనర్‌గా పని చేస్తుంది. దాని ఫీచర్‌లలో కొన్నింటిని చూద్దాం.

Geminiని పూర్తి స్థాయిలో వాడటం

నేచురల్‌గా లాంగ్వేజ్‌ను అర్థం చేసుకునేలా Geminiని డిజైన్ చేశాము. అయితే మీ తొలి ప్రాంప్ట్ కోసం జస్ట్ ఒక వాక్యం ఉన్న సాధారణ రిక్వెస్ట్‌లకు పరిమితం కాకుండా మరిన్ని వివరాలను యాడ్ చేస్తే మీకు చాలా ఉపయోగకరమైన ఫలితాలు వస్తాయి. మీరు స్పష్టమైన సూచనలను రూపొందించడానికి, ప్రాంప్ట్‌లను మొదటి నుండి సిద్ధం చేయడానికి మేము PARTS ఫ్రేమ్‌వర్క్ ‌ను ఉపయోగిస్తాము:

Persona: మీరు ఎవరు లేదా AI, ఏ రోల్‌ను పోషించాలి అన్నది తెలియజేయండి.

Aim: మీ లక్ష్యాన్ని స్పష్టంగా పేర్కొనండి—మీరు ఖచ్చితంగా ఏమి సాధించాలనుకుంటున్నారు?

Recipients: మీ ప్రేక్షకులు ఎవరో తెలియజేయండి, ఉదాహరణకు మొదటి సంవత్సరం కాలేజీ విద్యార్థులు లేదా ప్రైమరీ క్లాస్‌రూమ్.

Theme: "అనలిటికల్, ఫార్మల్" లేదా "హ్యూమరస్, ఎంగేజింగ్" వంటి మీకు కావలసిన స్టయిల్‌ను లేదా టోన్‌ను వివరించండి.

Structure: బుల్లెట్ పాయింట్ల లిస్ట్, గ్రేడింగ్ విధానం లేదా 30 సెకన్ల స్క్రిప్ట్ వంటి మీరు ఆశించే ఫార్మాట్‌ను పేర్కొనండి.

సురక్షితమైన & బాధ్యతాయుతమైన వినియోగం

ఈ ఫీచర్లు, గేమ్ చేంజర్ కాగలవు. అయితే వీటికి మీ ప్రొఫెషనల్ పర్యవేక్షణ తప్పనిసరి. AI "మోస్ట్ ప్రాబబుల్" అనదగ్గ తదుపరి స్టెప్‌ను అంచనా వేస్తుంది. కాబట్టి, అది హ్యూమన్ బయాస్‌లను (మానవ పక్షపాతాలను) చూపించవచ్చు లేదా వాస్తవాలను "హాలూసినేట్" కూడా చేయవచ్చు (ట్రెయినింగ్‌పై ఆధారితం కాని సమాధానాన్ని ఇవ్వగలదు). Google AI గైడ్‌లైన్స్‌కు హ్యూమన్-ఇన్-ది-లూప్ విధానం అవసరం: AI మొదటి డ్రాఫ్ట్‌ను అందిస్తుంది. కానీ తుది నిర్ణయం తీసుకోవడానికి మీరు మీ నైపుణ్యాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.

ఉపయోగకరమైన AI టూల్స్‌ను, టెక్నాలజీలను రూపొందించడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించడానికి, సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి, ప్రజల ఎదుగుదలకు తోడ్పడటానికి Google ఎలా కృషి చేస్తోంది అనే దాని గురించి మరిన్ని వివరాల కోసం మీరు ai.googleలింక్‌కు వెళ్లవచ్చు.

డెమో

ఒక సాధారణ టాపిక్‌ను తీసుకుందాం: గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్, K12 అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం Gemini లెసన్‌ను ఎలా డిజైన్ చేస్తుందో చూద్దాం.

डेमो- बालवाडी ते बारावी

डेमो- उच्च शिक्षण

ప్రాక్టీస్

ఇప్పుడు మీ వంతు. మీ సిలబస్‌లోని ఏదైనా ఒక కష్టమైన టాపిక్‌పై Geminiని ఉపయోగించి పని చేద్దాం - అంటే మీ విద్యార్థులు ఎప్పుడూ అర్థం చేసుకోలేక ఇబ్బందిపడే కాన్సెప్ట్ లేదా వారికి బోరింగ్‌గా అనిపించే ఏదైనా ఒక కష్టమైన కాన్సెప్ట్ అన్నమాట.

మీ టాస్క్:

  1. యాక్సెస్: gemini.google.com లింక్‌ను తెరవండి.

  2. రీఫ్రేమ్ ప్రాంప్ట్: ఏదైనా ఒక కష్టమైన కాన్సెప్ట్‌ను తీసుకుని, "దీన్ని మూడు రకాలుగా వివరించు: కథలా, దశల వారీ ప్రక్రియలా, ఒక విజువల్ రూపంలో" అని Geminiని అడగండి.

  3. స్కాఫోల్డ్ ప్రాంప్ట్: “ఈ టాపిక్‌పై ఎస్సే రాయడం మొదలెట్టేందుకు విద్యార్థికి సాయం చేసేలా కొన్ని బిగినింగ్ సెంటెన్స్‌ల సెట్‌ను క్రియేట్ చేయి” Geminiని అడగండి. లేదా “ఈ టాపిక్‌పై 1,000 పదాల వ్యాసానికి ఒక నిర్మాణాత్మక గ్రేడింగ్ విధానాన్ని జెనరేట్ చేయి” అని అడగండి.

  4. మెరుగుపరచండి: Geminiతో ‘సంభాషించండి’. ట్రై చేయండి: "అది కొంచెం ఎక్కువగా ఫార్మల్‌గా ఉంది. విద్యార్థులకు అర్థమయ్యేలా, దీన్ని మరింత సరళంగా, ఆసక్తికరంగా మార్చు."

రిఫ్లెక్షన్

ఈ సెషన్‌లో, Gemini అనేది కేవలం ఒక చాట్‌బాట్ మాత్రమే కాదని; అత్యుత్తమ నాణ్యత గల బోధనను అందించే ఒక ఇంజిన్ అని మనం తెలుసుకున్నాము.

మీ ప్రాక్టీస్‌ను రివ్యూ చేద్దాం:

మీ క్లాస్‌రూమ్ ఎక్స్‌పీరియన్స్‌ను రిఫ్లెక్ట్ చేస్తూ, అబ్‌స్ట్రాక్ట్‌గా ఉండే టెక్స్ట్‌బుక్ థియరీలకు, మీ విద్యార్థుల రోజువారీ జీవితానికి మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేస్తూ, క్లిష్టమైన కాన్సెప్ట్‌లను వారు ఈజీగా అర్థం చేసుకునేందుకు Gemini ఎలా సాయం చేస్తుంది?